ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పెషల్ సాంగ్ లో అందాలు ఆరబోసిన ‘ఎవ్లీన్’

cinema |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2019, 10:40 AM



రీసెంట్ గా యంగ్ నటుడు  ప్రభాస్ నటించిన `సాహో` చిత్రం లో  మెరిసింది నటి  ఎవ్లీన్ శర్మ. ఈ భామ  తన దాకా వచ్చిన ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. ఎవ్లీన్ నటిస్తున్నతాజా చిత్రం `ఎక్స్ రే ది ఇన్నర్ ఇమేజ్`. థ్రిల్లర్ నేపథ్యం లో రూపొందిన ఈ చిత్రం కోసం ఎవ్లీన్ శర్మ పై ఓ ప్రమోషనల్ సాంగ్ ని ఇటీవలే చిత్రీకరించారు. `జిగిలియా…` అంటూ సాగే ఈ రాపర్ సాంగ్ ని స్వాతీ వర్మ పాడారు. ఇటీవలే ఈ పాటని చిత్ర బృందం విడుదల చేసింది. పాటకు తగ్గట్టే జిగేల్ మనిపించే డ్రెస్సుల్లో ఎవ్లీన్ శర్మ హీటెక్కించేస్తోంది. దిల్బర్…చమ్మ చమ్మా… గీతాలకు ఎవర్గ్రీన్ మ్యూజిక్ ని  క్రియేట్ చేసిన రాజ్ అశూ ఈ పాటకు సంగీతం అందించారు. షాబీర్ అహమ్మద్ రాసిన ఈ పాటకు రాప్ ని `దిల్బర్..` ఫేమ్ ఇక్క అందించాడు. ఎవ్ లీన్ శర్మ వేడెక్కించే అందాలు ఈ వీడియో గీతానికి అస్సెట్. ఈ గీతంలో నెవ్వర్ బిఫోర్ అనే రేంజులో ఎవ్లీన్ రెచ్చి పోయి చిందులేయడం యంగ్ స్టర్స్ ని ఆకట్టుకుంటోంది. ప్రదీప్ కె. శర్మ నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ కె రుయీ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ మోడ్ లో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com