ఒక్క గంటలోనే దాదాపు ఆరు లక్షల మంది లైక్ కొట్టారు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 15, 2017, 03:58 PM
 

టీమిండియా క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇటీవల ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి రిసెప్షన్ ముంబైలో, ఢిల్లీలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. పెళ్లి చేసుకున్న ఈ కొత్త జంట హనీమూన్‌లో సరదాగా గడుపుతున్నారు. యూరప్‌లో తుంపరలా కురుస్తున్న మంచులో కోహ్లీ, అనుష్క హనీమూన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వారిద్దరూ హనీమూన్‌లో ఉన్న ఫొటోను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. తామిద్దరం స్వర్గంలో ఉన్నామని అనుష్క పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోకు అభిమానులు విపరీతంగా లైక్స్ కొడుతున్నారు. ఒక్క గంటలోనే దాదాపు ఆరు లక్షల మంది లైక్ కొట్టారు. 
Recent Post