ఎక్కవ ఫాలోవర్స్ .....ప్రియాంకాకు అవార్డును ఇచ్చారు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 15, 2017, 04:46 PM
 

ప్రస్తుతం టెక్నాలిజీ పరంగా ప్రపంచంలోని అగ్రదేశాలతో పాటు భారతదేశం కూడా ఎంతో అభివృద్ది చెందుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా చుట్టూ ప్రపంచం సాగుతోంది అనడంలో ఎలాంటి  సందేహం లేదేమో.. ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో మునిగితేలుతున్నారు. అయితే దీని వల్ల సోషల్ మీడియా కంపెనీలు ఎంతగా లాభ బడుతున్నాయో గాని సినిమా పరిశ్రమలకు అయితే చాలా లాభం చేకూరుతోంది. 


ముఖ్యంగా సినీ తారలు వారి ఇమేజ్ ను పెంచుకోవడానికి సోషల్ మీడియాని అడ్డాగా చేసుకుంటున్నారు. దీంతో అభిమానులు కూడా వారిని ఫాలో అవుతూ ఎప్పటికపుడు వారి గురించి తెలుసుకుంటున్నారు. ఇకపోతే అత్యధిక ఫాలోవర్స్ ని అందుకున్న వారికి సోషల్ సోషల్ మీడియా సంస్థలు అవార్డులు కూడా ఇస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు ఇన్స్టాగ్రామ్ వారు మంచి ఫాలోవర్స్ ని అందుకున్న సెలబ్రెటీగా అవార్డును ఇచ్చారు. 


అయితే ఇప్పుడు మళ్లీ మరొక సెలబ్రెటీని వారు ఎంపిక చేసి అవార్డును ఇచ్చారు. ఆమె ఎవరో కాదు 20 మిలియన్ ఫాలోవర్స్ ను సంపాదించిన బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ప్రియాంకా చోప్రా. ఎక్కవ ఫాలోవర్స్ ని అందుకున్న జాబితాలో ప్రియాంకా నిలవడంతో ఆమెకు అవార్డును ఇచ్చారు. దీంతో దీపికా చాలా సంతోషపడింది. అవార్డుతో ఒక ఫొటోకు స్టిల్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రీసెంట్ గా అమ్మడు ఏషియన్ మోస్ట్ సెక్సియెస్ట్ వుమెన్ గా గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే!
Recent Post