‘క్వీన్’ ట్రయిలర్ విడుదల

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 05, 2019, 09:43 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ టీజర్ ఇటీవల విడుదలైంది. మరో వైపు, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ మరో దర్శకుడు మురుగేశన్ తో కలిసి రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ‘క్వీన్’ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.
ఇందులో రాజకీయ నేతగా మారిన జయలలిత పాత్రను రమ్యకృష్ణ పోషిస్తున్నారు. ఈ ట్రైలర్ లో ఆమె వేషధారణ జయలలిత పాత్రకు దగ్గరగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. జయలలిత జీవితంలో రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుంచి జరిగిన కీలక ఘట్టాలను పోషించడానికి రమ్యకృష్ణ అయితేనే బ్యాలెన్స్ చేయగలదనే యూనిట్ నమ్మకాన్ని రమ్యకృష్ణ నిలబెట్టినట్లే కనిపిస్తోంది.
ఈ వెబ్ సిరీస్ లో జయలలిత చిన్నప్పటి పాత్రను అనిఖా సురేంద్రన్, సినీ నటి పాత్రను యువ కథానాయిక నివేదిత థామస్ పోషించారు. ఈనెల 14 నుంచి ఎంఎక్స్ ప్లేయర్ ద్వారా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ వీక్షకులకు అందుబాటులోకి రానున్నాయి.
Recent Post