“హేజా”. (ఎ మ్యూజికల్ హారర్) ప్రీ రిలీజ్ 1

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 06, 2019, 12:16 AM

సంగీత ద‌ర్శ‌కుడు మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “హేజా”. (ఎ మ్యూజికల్ హారర్). వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు. త‌నికెళ్ళ భ‌రణి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముమైత్ ఖాన్, నూతన నాయుడు( బిగ్ బాస్ ఫేమ్),ల‌క్ష్మ‌న్(ఆర్.ఎక్స్ 100ఫేమ్). లిజి గోపాల్, ప్రీతం నిగమ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మ్యూజికల్ హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం దసపల్లా హోటల్ లో జరిగింది.


నటుడు త‌నికెళ్ళ భ‌రణి మాట్లాడుతూ – “ఎట్టి పరిస్థితులలోనూ హిట్ కొట్టాలనే లక్ష్యం, తపన తో ఈ సినిమా తీశారు దర్శకుడు మున్నా కాశి. కొత్త పాయంట్ తో వస్తోన్నచిన్న సినిమా, వైవిధ్యమైన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్నఈ తరుణంలో వస్తోన్న ‘హేజా’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ – “హారర్ సినిమాలో ఎక్కువగా పాటలు ఉండవు కానీ ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి. డెఫినెట్ గా ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.


దర్శక నిర్మాత మున్నాకాశి మాట్లాడుతూ – “హేజా అంటే బ్యూటిఫుల్ అని అర్ధం. తెలుగులో మ్యూజికల్ హారర్ జోనర్ లో ఇంతవరకూ సినిమా రాలేదు. ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా. సినిమాలో ఒక డెవిల్ కి, మ్యుజిషియన్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమా. టెక్నికల్ గా చాలా బాగా ఉంటుంది. సినిమా చూడగానే ఒక బాక్సాఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అన్నారు.
Recent Post