ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వెంకీ మామ' మూవీ సెన్సార్ పూర్తి!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2019, 01:27 PM



డిసెంబర్ 13న 'వెంకీ మామ' విడుదల కానుంది. 'వెంకీ మామ' మూవీ విడుదలకు ఇంకా కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ జోరు పెంచారు. అయితే వెంకీ మామ టీం నేడు ఖమ్మం వేదికగా సందడి చేయనున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను అక్కడ నిర్వహించనున్నారు. నిన్న చిత్ర యూనిట్ ఈ మేరకు ప్రకటన చేయడం జరిగింది.ఇద్దరు మామ అల్లుళ్ళ మధ్య ప్రేమానురాగాలు, మరియు భావోద్వేగాలతో కూడిన ఒక మంచి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నేడు జరిగాయి. కాగా ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ లభించడంతో సినిమా యూనిట్ కొంత షాక్ కు గురైనట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో భాగంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ, 


సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతుందని, అలానే సెకండ్ హాఫ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ, కొంత సెంటిమెంట్ మరియు ఎమోషనల్ గా సినిమా సాగనున్నట్లు చెప్పారు. అయితే మొత్తంగా సినిమాకు తాము క్లీన్ యు సర్టిఫికెట్ వస్తుందని భావిస్తే యు/ఏ సర్టిఫికెట్ రావడంతో సినిమా టీమ్ కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి సినిమాలో యక్ష పార్ట్ ఎక్కువ ఉండడం వల్లనా, లేక హాట్ భామ పాయల్ అందాల ఆరబోత ఎక్కువ అవ్వడం వల్ల యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com