బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కు వ్యాఖ్యాత ఎవరు.? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మూవీ షూటింగ్ బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన ‘బిగ్ బాస్ 1’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి హోస్ట్ గా ఎన్టీఆర్ నే మళ్ళీ ఒప్పించాలని.. అప్పటిలోగా ఎలాగూ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయిపోతుంది కాబట్టి, ఎన్టీఆర్ కూడా ఒప్పుకుంటారని.. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో బిగ్ బాస్ ను చాల డిఫరెంట్ గా ఓ స్పెషల్ ప్లాన్ చేయాలని.. నిర్వహలు ఇప్పటినుండే చర్చలు జరుపుతున్నారట. ఆ సీజన్ అంతటా తనదైన శైలి యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎన్టీఆర్ విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు బిగ్ బాస్ 4 కోసం ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారట. అంతేకాకుండా డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయ్యారని సమాచారం. మరి ఈ బంపర్ ఆఫర్‌కు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.