ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమాకి నాగార్జున గ్యాప్ ఇచ్చాడా ?

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2019, 02:47 PM



నాగార్జున మొన్నటి వరకు బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా తన సినిమాలను కూడా పక్కనబెట్టి ఒప్పుకున్న బిగ్ బాస్ పూర్తి చేసాడు. ఈ సీజన్ పూర్తై కూడా నెల రోజులవుతుంది. దాంతో నెక్ట్స్ ఏం చేస్తాడు.. ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మన్మథుడు 2 సినిమాతో ఈయనకు పరాజయం మాత్రమే కాకుండా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు నాగ్. దాంతో పవర్ ఫుల్ పోలీస్ డ్రామాతో రాబోతున్నాడు ఈ సీనియర్ హీరో. తమ హీరో ఎందుకు ఇలాంటి సినిమా చేసాడంటూ బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 60 ఏళ్ల వయసులో నాగ్ చేసిన మన్మథుడు 2 ప్రయోగం అస్సలు నచ్చలేదు సరికదా విమర్శలు తీసుకొచ్చే సరికి ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు ఈ సీనియర్ హీరో. సాక్షాత్తు కోడలు సమంతకు కూడా నాగార్జున చేసిన సినిమా నచ్చలేదు. ఇక ఇప్పుడు బంగార్రాజు సినిమాతో రావాలని చూస్తున్నాడు నాగార్జున. అయితే ప్రస్తుతం ఈయన ఆలోచనలను బట్టి చూస్తుంటే నాగ్ ఈ సినిమాకి కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తర్వాతి సినిమాను యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. నిజానికి మన్మథుడు 2 తర్వాత బంగార్రాజు సినిమా చేయాలనుకున్నాడు నాగ్. కానీ మన్మథడు 2 తర్వాత వెంటనే అలాంటి సినిమా చేస్తే మంచిది కాదని ఆలోచిస్తున్నాడు నాగ్. అందుకే కాస్త హూందాతనం ఉన్న పాత్ర కోసం చూసి.. సోలోమెన్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఆయనతో సినిమా చేయబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు నాగార్జున. గతంలో నాగ్ పోలీస్ డ్రస్ వేసినపుడు చాలా వరకు విజయం సాధించాడు. చూడాలి మరి ?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com