ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రూలర్' మూవీ కోసం బాలయ్య రెమ్యూనిరేషన్ ఎంతంటే?

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2019, 03:01 PM



బాలకృష్ణ హీరో గా కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన  'రూలర్' మూవీ ఈనెల 20 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బాలయ్య అదిరిపోయే రెమ్యూనిరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆయన ఇంత మొత్తంలో రెమ్యూనిరేషన్ గత చిత్రాలు వేటికి తీసుకోలేదని నిజానికి ఆయన రెమ్యూనరేషన్ నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు తీసుకుంటే ఈ చిత్రంకోసం మాత్రం ఆయన ఏకంగా 10కోట్లు తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు బాక్సాఫీస్ ముందు ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఆ చిత్రాలు హిట్ అయి ఉంటే కనుక ఇప్పుడు ఇచ్చే రెమ్యూనరేషన్ పై ఎవరికి ఎలాంటి ఆలోచనలు వచ్చేవి కావు కానీ ఇప్పుడు ఈ విషయం విన్న ప్రతి ఒక్కరికి కొంచం షాకింగ్‌గానే ఉందని చెప్పాలి. ఇప్పటికే కొత్త గెటప్‌తో ఐరన్ మ్యాన్ స్టైల్ గెటప్‌తో అందర్నీ ఆకర్షించిన బాలయ్య ఈ చిత్రంలో సోనాలీ చౌహన్‌, వేదికలతో రొమాన్స్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన జైసింహ చిత్రం హిట్ కావడంతో ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com