ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తికేయలో మార్పు రావాలంట!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2019, 06:05 PM



కార్తికేయ ఆరెక్స్ 100తో సూపర్ హిట్ అందుకున్న ఆ తర్వాత వరుస ఫ్లాపులు చేస్తున్నాడు. హిప్పి, గుణ 369 సినిమాల్లో నటించిన కార్తికేయ ఆ సినిమాలతో నిరాశపరచాడు. అయితే నానితో గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా చేసి మెప్పించాడు ఈ యువ హీరో. లేటెస్ట్ గా 90 ఎం.ఎల్ అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం రిలీజైన ఈ సినిమాలో కూడా పెద్దగా మ్యాటర్ ఏం లేదు అన్నది పబ్లిక్ టాక్. అయితే ఆరెక్స్ 100 వరకు ఒకే కాని హిప్పి, గుణ 369 90 ఎం.ఎల్ ఈ సినిమాల్లో కార్తికేయ యాక్టింగ్ ఒకే విధంగా ఉంది అన్నది అందరి మాట. నటుడిగా సినిమా సినిమాకు పరిణితి చెందాలి కాని కార్తికేయలో అలాంటి మార్పు కనిపించడం లేదని అంటున్నారు. కుర్రాడి వేగానికి మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే మాత్రం మళ్ళీ మరో సూపర్ హిట్ తన ఖాతాలో పడుతుంది. అయితే కథల విషయంలో కచ్చితంగా కార్తికేయ మరోసారి ఆలోచించాలని అంటున్నారు. అయితే ఎనర్జీ విషయంలో మాత్రం ఒక స్టార్ హీరో అయ్యే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com