ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయలలిత ఇష్టసఖుడి పాత్రలో రౌడీ!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 08:37 AM



ప్రముఖ సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ తెరకిక్కిస్తున్నారు. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కంగన రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే సినిమాలో కీలక పాత్రలు పోషిస్తోన్న వారి వివరాలను చిత్రయూనిట్ వెల్లడించింది. అమ్మ లుక్‌కి సంబంధించిన మోషన్ టీజర్‌ని ఇంతకుముందు విడుదల చేస్తే మిశ్రమ స్పందనలు వచ్చాయి. కంగన లుక్‌పై కొన్ని విమర్శలు వైరల్ అయ్యాయి. ఇక జయలలిత జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో అలనాటి సోగ్గాడు శోభన్ బాబు ఒకరు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రేమించుకున్నారన్న ప్రచారం అప్పట్లో సంచలనమైంది. అంతేకాదు జయలలిత నుంచి ఈ అందగాడి ఎడబాటు వెనక ఓ తమిళనటుడి కుట్ర ఉందన్న ప్రచారం కూడా అప్పట్లో సాగింది.అందుకే ఇప్పుడు శోభన్ బాబు పాత్ర ఎంతో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ పాత్రలో యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. జయలలిత ఇష్టసఖుడి పాత్రలో విజయ్ కనిపించబోతున్నారని కొత్త ప్రచారం ఇప్పుడు కోలీవుడ్ సహా టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తేలాల్సి ఉంది. ఈ చిత్రంలో కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్, ఎంజిఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com