ప్రియాంక‌రెడ్డి ఘటనపై యాంకర్ సుమ వీడియో

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 10:49 AM

ప్రియాంక‌రెడ్డి ఘటన ప్రతి ఒక్కరిని కదిలించింది. ఇందులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే సినీతారలు దీనిపైన తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. యాంకర్ సుమ తన యూట్యూబ్ ఛానెల్లో ప్రియాంక‌రెడ్డి ఘటనపై ఓ ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేసింది.. ప్రియాంక‌రెడ్డి ఎన్‌కౌంటర్ విషయం గురించి మాట్లాడుతూ..అమ్మాయిల సేఫ్టీపై ప్రశ్నించింది. ముఖ్యంగా ఓ అమ్మాయి వేసుకునే డ్రస్సులు చూసి అత్యాచారాలు జరుగుతున్నాయంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతుంది సుమ.. ఆడపిల్లలు పుట్టడం, అందంగా ఉండడం తప్ప.. కనీసం ఎలాంటి బట్టలు వేసుకోవాలనే స్వేచ్ఛ కూడా మాకు లేదా అని ప్రశ్నించింది సుమ. బట్టల గురించి మనుషుల్లో మైండ్ సెట్ మారిపోవాలని చెప్పుకొచ్చింది సుమ.. ఇంకా ఈ వీడియోలో చాలా విషయాలని చెప్పుకొచ్చింది సుమ.. ప్రియాంక‌రెడ్డి ఎన్‌కౌంటర్ లో కీలక పాత్ర పోషించిన తెలంగాణా పోలిసులకి హాట్స్ ఆఫ్ చెప్పింది . నిర్భయ ఘటనలో కూడా ఇప్పటి వరకు చంపేయకుండా మేపుతున్నారంటూ చురకలు అంటించింది సుమ. 
Recent Post