ఇప్పటిదాకా నాకు డాన్సులు చేసే అవకాశం రాలేదు: కార్తికేయ

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 12:41 PM

 ఆర్‌ఎక్స్‌ 100 మూవీ తో  ప్రేక్షకుల ముందుకొచ్చారు యువ హీరో కార్తికేయ.  అయితే తాజాగా 90 ఎంఎల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు . ఈ సినిమాకు మిశ్రమ స్పందన ఉన్నా, మంచి వసూళ్లు దక్కుతున్నాయని చెబుతున్నారు కార్తికేయ. మాస్‌ హీరోగా నిలబెడుతుం దనే నమ్మకాన్ని వ్యక్తం చేశారాయన. కార్తికేయ మాట్లాడుతూ..90ఎంఎల్‌ సినిమాకు ఓపెనింగ్స్‌ బాగున్నాయి. నేను కొన్ని థియేటర్‌లకు వెళ్లాను. అక్కడ ప్రేక్షకులు సినిమాను ఆద్యంతం ఆస్వాదిస్తున్నారు. నేను ఫైట్లు, డాన్సులు చేస్తున్నప్పుడు ఈలలు కొడుతున్నారు. నేను చిరంజీవి గారి సినిమాల్లో ఫైట్లు, పాటలు చూసి హీరో అవ్వాలనుకున్నా. ఇప్పుడు నా సినిమాలో వాటికే జనాలు ఈలలు వేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆర్‌ఎక్స్‌ 100 తర్వాత మళ్లి అదే తరహా చిత్రాలు కాకుండా కొత్త కథలు చేయాలనే ప్రయత్నంలో ఒప్పుకున్న సినిమా ఇది. మళ్లి ఒకటే తరహా సినిమాలు చేస్తే మూస ముద్ర వేస్తారు. ఈ వ్యక్తికి బాల్యం నుంచి తాగుడు అలవాటు తప్పనిసరి అనే అంశం బాగా నచ్చి సినిమా ఒప్పుకున్నాను. సినిమాకు మిశ్రమ స్పందన ఉందని కొందరు చెప్పినా, నటుడిగా నా ప్రతిభను మెచ్చుకుంటున్నారు. డాన్సులు, ఫైట్లు బాగా చేశావ్‌ అంటున్నారు. ఈ సినిమాతో మాస్‌ హీరో అయిపోదామని అనుకోలేదు. కానీ ఆ పేరు వస్తోంది. ఇకపై ఎవరైనా రచయిత కథ రాసేప్పుడు కార్తికేయ ఇలాంటి మాస్‌ సినిమా కూడా చేస్తాడు అనిపించాలి. ఇప్పటిదాకా నాకు డాన్సులు చేసే అవకాశం రాలేదు. ఎందుకంటే ఎంచుకున్న కథలు అలాంటివి. సెన్సార్‌ వాళ్లు సినిమా చూసేందుకు ఆలస్యం చేశారు. చూశాక ఒక్క రోజులో ధృవీకరణ ఇచ్చారు. వసూళ్లు ఎంత అనే అంకెలు నాకు తెలియవు. అయితే మంచి వసూళ్లు వస్తున్నట్లు, నేను సందర్శించిన థియేటర్‌లలో చెప్పారు. 
Recent Post