'ఆర్ఆర్ఆర్' మూవీ హక్కులు కూడా ఆయనకేనా ?

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 12:50 PM

రాంచరణ్,  ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఇప్పటికే 80  పూర్తి చేసుకుంది. అయితే బాహుబలి విజయం వలన దాని నిర్మాతైన శోభు యార్లగడ్డ కంటే కూడా అధికంగా ఫలితం పొందిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయనే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. బాహుబలి హిందీ వర్షన్స్ ని కరణ్ తన ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనితో ఆయన బాహుబలి వలన ఊహించని లాభాలు గడించడం జరిగింది. ఐతే బాహుబలి సినిమా ఉత్తర భారత ప్రజలకు చేరువ చేయడంలో ఆయన కృషి ఉంది. కాబట్టి రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ హిందీ విడుదల హక్కులు కూడా ఆయనే దక్కించుకునే అవకాశం కలదు. ఒక వేళ తీవ్రపోటీ నెలకొన్న నేపథ్యంలో వేరే సంస్థలు దక్కించుకునే అవకాశం కూడా లేకపోలేదు. బాహుబలి సినిమా బాలీవుడ్ లో నెగ్గుకు రావడానికి కరణ్ చేసిన సపోర్ట్ చాలా ఉంది. ఒక బలమైన శక్తిగా ఉన్న కరణ్ మద్దతు కారణంగానే బాహుబలి చిత్రం థియేటర్ల సమస్య వంటిది ఎదుర్కోలేదు. కాబట్టి ఈసారి కూడా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ హక్కులను కూడా కరణ్ కే కట్టబెట్టే అవకాశం కలదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.
Recent Post