ఈ యంగ్ హీరో సెంటిమెంట్ ఫలిస్తుందా ?

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:01 PM

 రాజ్ తరుణ్ మొదటి సినిమా అయిన ఉయ్యాలా జంపాలా ద్వారా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కుమారి 21 ఎఫ్ అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఏదీ కూడా అతని సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన లవర్ చిత్రం కూడా అతనికి పరాజయాన్నే మిగిల్చింది. అయితే ప్రస్తుతం అదే దిల్ రాజు బ్యానర్ లో "ఇద్దరి లోకం ఒకటే " అనే లవ్ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వస్తున్నాడు. షాలినీ పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 25 తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇక్కడేరాజ్ తరుణ్ ఒక సెంటి మెంట్ ని నమ్ముకున్నాడు. తన మొదటి చిత్రం అయిన ఉయ్యాల జంపాల సినిమా 2013 డిసెంబర్ 25న విడుదలైన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే తేదీలో విడుదల కాబోతున్న ఇద్దరి లోకం సినిమా కూడా సక్సెస్ దక్కించుకుంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయన్న సంగతి ప్రతీ ఒక్కరికీ తెలుసు. అయితే ఆ సెంటిమెంట్ ఎంత మేరకు వర్కవుట్ అవుతుందనేది చెప్పలేం. రాజ్ తరుణ్ సెంటిమెంట్ ఫలిస్తుందా ? లేదా ? చూడాలి. 
Recent Post