మహేష్ మూవీ నుంచి రేపు వచ్చే రెండో సాంగ్ ఇదే..!

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:17 PM

మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మైండ్ బ్లాక్ పాటను విడుదల చేసారు. పక్కా మాస్ బీట్‌తో సాగిపోయే ఈ పాట మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది.అయితే  రీసెంట్ గా రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ టీజర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాదు సినిమా ఫై మరింత అంచనాలు పెంచేసింది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రతి సోమవారం సినిమాలోని సాంగ్స్ ను ఒక్కోటిగా రిలీజ్ చేస్తుండగా..రేపు మూవీ నుంచి సూర్యుడివో చంద్రుడివో అనే మెలోడీ సాంగ్ ను సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్‌ నటి విజయశాంతి చాలా ఏళ్ల తరువాత సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. సీనియర్‌ నటులు రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్ రాజ్‌లతో పాటు అజయ్‌, బండ్ల గణేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్‌ రాజు బ్యానర్‌ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో నిర్మాత అనిల్‌ సుంకరతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Recent Post