ఏమాత్రం సిగ్గులేకుండా పడుకుంటావా అని అడిగారు: మంజరి ఫడ్నిస్

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:36 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీ అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా వంచిస్తున్నారని ఎప్పటినుంచో కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయమై చాలామంది హీరోయిన్లు నోరువిప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే విషయమై మాట్లాడుతూ మరో హీరోయిన్ మంజరి ఫడ్నిస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.  తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని శ్రీ రెడ్డి లాంటి తార పెద్ద దుమారమే లేపింది. అప్పటినుంచి మొదలు ఈ అంశం నిత్యం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. రోజుకో హీరోయిన్ ఈ విషయమై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంజరి ఫడ్నిస్ తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేసింది. కొందరు దర్శకనిర్మాతలు తనకు అవకాశం ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చారని.. అయితే తీరా ఆ సినిమాకు సంతకం చేసిన తర్వాత పడక సుఖం తీర్చాల్సిందిగా కోరేవారని చెప్పుకొచ్చింది. నిజానికి తనకు చాలా పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా.. దర్శక నిర్మాతలు ఏమాత్రం సిగ్గులేకుండా పడుకుంటావా అని అడిగారని, అందుకే ఆ అవకాశాలు వదులుకున్నానని చెప్పింది మంజరి. తాను సినిమాల్లో ఎక్కువకాలం కొనసాగలేక పోవడానికి ప్రధాన కారణం అదే అని చెప్పింది మంజరి. తన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్‌లో కూడా ఉండిపోయానని చెప్పుకొచ్చింది. చిత్రసీమలో పడక సుఖం అందిస్తే తప్ప అవకాశాలు రావని మంజరి చేసిన ఈ ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది ఈ హీరోయిన్. తిరిగి మరోసారి బెడ్‌రూంకి వెళ్తేనే అవకాశాలు వస్తాయని సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Recent Post