కార్తికేయ కోసం బంపర్ ఆఫర్!

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 08, 2019, 01:57 PM

ఆర్‌ఎక్స్‌ 100 మూవీ తో  ప్రేక్షకుల ముందుకొచ్చారు యువ హీరో కార్తికేయ. తాజా గా ’90 ఎం.ఎల్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు . కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఈ సినిమాతో 2019కి శుభం కార్డ్ వేయాలనుకున్న ఆయనకు నిరుత్సాహం ఎదురైందనే అనాలి. ఇలా వరుస పరాజయాలు ఎదురవడం వలన ఆయన కెరీర్ ఇబ్నందుల్లో పడుతుందని, ఆయన సినిమా అవకాశాలు తగ్గుతుందని అనుకున్నారు. కానీ ఈ యువ హీరోకి ఒక పెద్ద ఛాన్స్ రెడీగా ఉందట. ఒక పెద్ద నిర్మాత తన నిర్మాణ సంస్థలోనే కార్తికేయతో సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరిగి ప్రాజెక్ట్ ఫైనల్ అయిందట. త్వరలోనే ఈ అఫీషియల్ క్కన్ఫర్మేషన్ వెలువడే అవకాశం ఉంది. మరి కార్తికేయకు ఆఫర్ ఇచ్చిన ఆ బడా నిర్మాత ఎవరు, సినిమా వివరాలేమిటి అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాల్సిందే.




Recent Post