ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్ ఏకిపారేసిన అనసూయ!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 02:48 PM



జబర్దస్త్ షో తో యాంకర్ అనసూయ అంటే తెలియనివారు ఉండరు. అయితే  తాజాగా అనసూయకు సోషల్ మీడియాలో నెటిజన్స్ లేనిపోని తలనొప్పి సృష్టిస్తున్నారు. ఆమె తమ మెసేజ్‌లపై స్పందించాలంటూ నోటికి ఏం వస్తే అది పెట్టేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ అలాగే చేశాడు. జగదీష్ అనే వ్యక్తి అనసూయ వేసుకున్న డ్రస్సులపై కామెంట్స్ చేస్తూ. నీకు పెళ్లైంది ఇవన్నీ అవసరమా అంటూ కామెంట్ చేశాడు. దీనిపై మండిపడ్డ అనసూయ... నీకు బుర్రలేదు... ఇవన్నీ నీకు అవసరమా అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానికి మెత్తబడ్డ నెటిజన్... సారీ అనసూయ గారూ అంటూ మరో ట్వీట్ తాజాగా పోస్టు చేశాడు. మీరు స్పందించాలనే అలా కామెంట్లు పెట్టి మిమ్మల్ని బాధపెట్టాను సారీ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.అంతకుముందు అనసూయను విమర్శిస్తూ పెట్టిన ట్వీట్ కూడా ఆ వ్యక్తి డిలీట్ చేశాడు. దీనికి కూడా రిప్లై ఇచ్చిన అనసూయ... ‘డబుల్ స్టాండర్ట్ పార్ట్ 1’ అంటూ ట్వీట్ చేసింది. ఆ నెటిజన్‌కు చెంప ఛెళ్లుమనేలా రిప్లై ఇచ్చింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com