ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో వ హీరో నాగ శౌర్య హీరోగా రూపొందు తున్న చిత్రం 'అశ్వథ్థామ'. శౌర్య అమ్మగారు ఉష మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నాన్నగారు శంకర్ ప్రసాద్ సమర్పిస్తుండటం తో చిత్రం మీద చాలా అంచనాలున్నాయి. రమణ తేజ అనే నూతన దర్శకుడిని నాగ శౌర్య తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేస్తుండగా మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తోంది.
బుధవారం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా మీట్లో తమ 'అశ్వథ్థామ' సినిమాను వచ్చే ఏడాది జనవరి 31 న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే శౌర్య ఇంత ఇంటెన్స్ లుక్ లో కూడా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ యాక్షన్ హీరో తరహాలో కోపంగా ఒక చక్రం లాంటి ఇనుప వస్తువును విసురుతూ కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ ఒక పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో భాగం అనిపిస్తోంది.