ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా తో కాజల్ అగర్వాల్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 01:01 PM



 తెలుగు సినిమాల్లో కాజల్ అగర్వాల్ కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. తేజ 'లక్ష్మీ కళ్యాణం'తో టాలీవుడ్‌కు పరిచయమైనా  కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' సినిమాతో ఎక్కువమంది తెలుగువారికి  దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో  ఇక అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ తెలుగువారిని తన అందచందాలతో పాటు ఎవరిని నొప్పించని మనసుతో అలరిస్తూనే ఉంది.  స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తోంది. అయితే కేరిర్ మొదట్లో  గ్లామర్ పాత్రలకే పరిమితమైన కొంత కుదురుకున్న తర్వాత నటనకు ప్రాధాన్యమున్న సినిమాలలో నటిస్తూ అభిమానుల్ని సంపాదించుకుంది. అది అలా ఉంటే తాజాగా నటుడు రానా తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్బంగా కాజల్ ఓ అపురూపమైన ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రానాకు బర్త్ డే విషేస్ తెలిపింది. ఆ ఫోటోలో ఇద్దరు అదరగొట్టారు. ప్రేమగా కాజల్, రానాను హత్తుకోవడం అభిమానుల్నీ ఫిదా చేస్తోంది. ఈ ఇద్దరూ నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com