త్రిష కి బంపర్ ఆఫర్ !

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 01:30 PM

త్రిష తమిళంలో ఎన్ని హిట్స్ అందుకున్నదో పక్కన పడితే... తెలుగులో మాత్రం ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఒకప్పుడు త్రిష లేకుండా తెలుగు సినిమాలు ఉండేవి కాదు అనే విధంగా ఉన్నది. ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్ల తాకిడి పెరిగిపోవడంతో కొత్తవాళ్లు వచ్చి త్రిష స్థానాన్ని ఆక్రమించారు. ఇప్పుడు త్రిష తెలుగు సినిమా చేసి చాలా రోజులైంది.కాగా, చాలా కాలం తరువాత మరలా తెలుగులో నటించేందుకు సిద్ధం అవుతున్నది. మెగాస్టార్ 152 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభమైంది. అయితే, రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. ఇందులో హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉండనే విషయం తెలియాల్సి ఉన్నది. త్రిష ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం త్రిష చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి పొన్నియన్ సెల్వన్, రెండోది మోహన్ లాల్ సినిమా కాగా, మూడో సినిమా మెగాస్టార్ సినిమా అని చెప్పి త్రిష ట్వీట్ చేసింది. హీరోయిన్ త్రిష మెగాస్టార్ తో సినిమా చేస్తున్నట్టు ప్రకటించినా... త్రిష తమ సినిమాలో చేస్తున్నట్టు ఇంకా దర్శక నిర్మాతల నుంచి సమాచారం అందలేదు. గతంలో మెగాస్టార్ తో కలిసి త్రిష స్టాలిన్ సినిమా చేసింది. ఆ సినిమాలో త్రిష నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా పరంగా మంచి విజయం సాధించింది. 
Recent Post