షారుఖ్ సినిమాలు ప్లాపు అవడానికి కారణం అదేనట!

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 15, 2019, 01:48 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ని వరుస ప్లాపులు వస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ఆయన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. దానికి కారణాలని షారుఖ్ తెలిపారు. బీబీసీ 'టాకింగ్ మూవీస్' కార్యక్రమం ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం కోసం బీబీసీ వ్యాఖ్యాత టామ్ బ్రూక్స్‌కు షారుఖ్ ఖాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన షారుఖ్ ఖాన్ మంచి కథలని ఎంచుకోకపోవడమే తన సినిమాల ప్లాపులకి కారణమని తెలిపారు. 'మేం మంచి చిత్రాలు తీయలేదు. అందుకే అవి విజయవంతం కాలేదు. భారత్‌లో క్రికెట్ ఆడటం, సినిమాలు తీయడం అందరికీ తెలుసు. సచిన్‌కు బ్యాటింగ్ ఎలాగో, నాకు కథ చెప్పడం ఎలాగో కూడా కొందరు నేర్పుతుంటారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను కథను సరిగ్గా చెప్పలేకపోయాను. అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నేను వినయంతో ఈ విషయం చెప్పట్లేదు. నిజాయితీగా చెబుతున్నా' అన్నారు షారుఖ్
Recent Post