ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాకీ ప్లేయర్స్‌గా లావణ్య త్రిపాఠి

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 02:18 PM



హాకీ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో సందీప్‌కిషన్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్స్‌గా నటిస్తున్నారు. ఇది వరకే సందీప్ కిషన్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.  హీరోయిన్ లావణ్య త్రిపాఠి సందీప్ కిషన్ `A1 ఎక్స్‌ప్రెస్‌`లో నటిస్తున్నారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఈ సినిమాలో లావణ్య లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నారు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్‌, దయా పన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com