ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ కెరీర్‌లో మొదటిసారి అలా చేయబోతున్నాడు...

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2019, 04:19 PM



నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘రూలర్’ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ టైటిల్ కోసం బాలయ్య, బోయపాటి శ్రీను దిల్ రాజుతో మాట్లాడినట్టు సమాచారం. ఈ సినిమాను బోయపాటి శ్రీను తనదైన స్టైల్‌లో మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించబోతున్నాడు. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత వీళ్లిద్దరి కలయిలో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను ముందుగా సమ్మర్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రీసెంట్‌గా వెంకటేష్, తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమాను తన పుట్టినరోజున విడుదల చేసాడు. వెంకటేష్ బర్త్ డే రోజున విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ఇపుడు అదే రూట్లో బాలకృష్ణ కూడా బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను జూన్ 10న తన పుట్టినరోజున విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. 45 ఏళ్ల సినీ కెరీర్‌లో నందమూరి బాలకృష్ణ మొదటిసారి అలా చేయబోతున్నాడు. ఇది చూసి అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకు పుట్టినరోజుకు అటు ఇటుగా బాలయ్య సినిమాలు రిలీజైనా.. ఆయన ఏ బర్త్ డే రోజున ఏ సినిమా విడుదల కాలేదు. ఇపుడా లోటును బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాతో తీర్చుకోవాలనుకుంటున్నారు బాలయ్య.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com