ఎన్టీఆర్ డ్రైవర్‌ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు ?

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 04:46 PM

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్. సినిమాల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే జూనియర్ ఎన్టీఆర్.. తన దగ్గర పనిచేసేవారి విషయంలో అంతే కేర్ తీసుకుంటాడట. ఆ మధ్య కారు డ్రైవింగ్ చేస్తూ తారక్‌కు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే . దీంతో అప్పటి నుంచి జూనియర్ ఏదో అత్యవసరమైతే తప్పించి కారు డ్రైవ్ చేయడం లేదు. అందుకే తన కోసం ప్రత్యేకంగా ఒక డ్రైవర్‌ను పెట్టుకున్నాడు. తండ్రి హరికృష్ణ, పెద్దన్న జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో డ్రైవర్ విషయంలో ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడట.దాంతో ఎంతో అనుభవం ఉన్న ఒక డ్రైవర్‌ను పెట్టుకున్నాడట. ముఖ్యంగా ఎన్టీఆర్ దగ్గర పనిచేసే డ్రైవర్ ఇంత వరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదట. అంతేకాదు అతనికి మద్యం అలవాటు కూడా లేదని చెబుతున్నారు.  అందుకే అతనికి నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు జీతం ఇస్తున్నట్టు టాక్. ఏమైనా తన ప్రాణాలను సురక్షితంగా కాపాడే డ్రైవర్‌కు ఎన్టీఆర్ ఆ మాత్రం ఇచ్చుకోవడం సబబే అంటున్నారు తారక్ అభిమానులు. 




Recent Post