హరితేజ చేతిలో ఫుల్లుగా ఆఫర్లు !

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 05:21 PM

 హరితేజ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి నటనతో.. కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది.    'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాతో టాలీవుడ్ జర్నీ ప్రారంభించిన హరితేజ 'దమ్ము'.. 'అత్తారింటికి దారేది' లాంటి స్టార్ హీరోల సినిమాలలో నటించింది. అయితే హరితేజకు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం 'అ ఆ'. బిగ్ బాస్ లో తనలోని ప్రతిభని చింపి అందరి ఆకట్టుకుంది. టాలీవుడ్ లో కమెడియన్లు చాలామంది ఉన్నారు కానీ పాపులర్ లేడీ కమెడియన్స్ సంఖ్య తక్కువే. దీంతో హరితేజకు ఫుల్ గా ఆఫర్లు వస్తున్నాయట.  బడా నిర్మాతలు తమ సినిమాలలో నటించాల్సిందిగా హరితేజకు ఆఫర్లు ఇస్తున్నారట.  తెగ ఫోన్ కాల్స్ చేస్తున్నారట. అయితే హరితేజ మాత్రం తన వద్దకు వచ్చిన ప్రతి ఆఫర్ ను ఒప్పుకోకుండా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటోందట.  తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒప్పుకుంటోందట.  మిగతా ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తోందట.  అయితే హారిక హాసిని/సితార ఎంటర్టైన్మెంట్స్ విషయంలో మాత్రం హరితేజ గట్టిగా ఉండడం లేదట.  వారికి మాత్రం ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు ఇస్తోందట. తనకు 'అ ఆ' తో మంచి బ్రేక్ ఇచ్చారనే అభిమానంతో ఇలా చేస్తోందని అంటున్నారు. హరితేజ ఫ్యూచర్ ప్రాజెక్టులవిషయానికి వస్తే మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లో నటిస్తోంది.  ఈ సినిమానే కాకుండా హరితేజ చేతిలో ఫుల్లుగా ఆఫర్లు ఉన్నాయి.  అయినా బడా నిర్మాతలు ఇంకా హరితేజకు ఆఫర్లు ఇస్తామని వెంటపడుతున్నారంటే హరితేజ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు
Recent Post