మహేష్ మూవీ నుంచి ‘హి ఈజ్ సో క్యూట్’ సాంగ్ రీలీజ్

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 05:32 PM

మహేష్ బాబు హీరోగా  రష్మిక కథానాయికగా నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. విజయశాంతి ముఖ్య పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ ప్రేక్షకులలో మూవీపై అంచనాలు పెంచింది. దేవి శ్రీ సంగీతం కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు. వచ్చే నెల 5న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ చిత్రంలో మిలటరీ సాంగ్ సహా మూడు పాటలను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా.. మహేష్ బాబును రష్మిక మందన్న ఆట పట్టిస్తున్న ‘హి ఈజ్ సో క్యూట్’ పాటను రిలీజ్ చేసారు. ఈ పాటలో మహేష్ బాబును టీజ్‌ చేస్తూ చేసిన పాట ఇపుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Recent Post