బాలయ్య 'రూలర్' యూ/ఏ సర్టిఫికేట్...

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 16, 2019, 05:52 PM

నందమూరి బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'రూలర్' చిత్రం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.  తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఈ చిత్రంలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో ఈ చిత్రానికి సెన్సార్ వాళ్లు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసారు. ఇక సెన్సార్ వాళ్లు ‘రూలర్’  సినిమాను చూసి నిర్మాతను అభినందించినట్టు సమాచారం. యాక్షన్ చిత్రమే అయిన ఇందులో సమాజానికి ఉపయోగపడే కొన్ని సన్నివేశాలు ఉన్నట్టు టాక్. అంతేకాదు ఈ చిత్రంలో రైతులతో పాటు కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు సెన్సార్ వాళ్లు కదిలించినట్టు చెబుతున్నారు. మొత్తానికి బాలయ్య ‘రూలర్’ మూవీ పేరుకు యాక్షన్ చిత్రమే అయినా.. అన్ని అంశాలను జోడించి తెరకెక్కించినట్టు సెన్సార్ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది. మొత్తానికి ‘రూలర్’గా నట సింహం బాక్సాఫీస్ దగ్గర మరోసారి గర్జిస్తాడా లేదా అనేది చూడాలి.
Recent Post