ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన టాలెంట్ తో మెస్మరైజ్ చేయబోతున్నా రవితేజ !

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2020, 04:44 PM



 రవితేజ మరోసారి సింగర్ అవతారం రవితేజ పాట పాడటం కొత్తేమీ కాదు. బలుపు సినిమాలో కాజల్ కు చెల్లివా సాంగ్ ముందు వచ్చే సాకీని ఆలపించాడు. ఆ తర్వాత పవర్.. రాజాది గ్రేట్ లో వాయిస్ మాత్రమే ఇచ్చిన రవితేజ డిస్కో రాజాలో బప్పీలహరితో కలిసి ఫుల్ సాంగ్ నే పాడాడు. బలుపు.. పవర్ సినిమాలతో రవితేజలోని గాయకుడిని తమన్ బైటకు తీసుకొచ్చాడు. ఈ సారి మాటలతో సరిపెట్టుకోకుండా పాటనే ఇచ్చాడు. రమ్ పమ్ బమ్ అంటూ సాగే పాట మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు. ఒక్క క్షణం దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కో రాజా ఈనెల 24న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ అనే చెప్పేశాడు దర్శకుడు. నభా నటేశ్.. పాయల్ హీరోయిన్స్ గా నటించగా.. బాబీ సింహా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. మాస్ రాజా డిఫరెంట్ గెటప్స్.. షేడ్స్ లో కనిపిస్తూ కొత్తగా ట్రై చేశాడు. డిస్కో రాజాలో పాటతో అందర్నీ మెస్మరైజ్ చేయబోతున్నాడు. మొత్తానికి రవితేజ తన ఎంత టాలెంట్ ఉందో అంతా బయటపెట్టేసి అభిమానులకు ఫుల్ మజా పంచబోతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com