రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రోపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ కోసం నిజానికి కేవలం మన దేశంలోనే కాక, పలు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ సినిమాను దాదాపుగా రూ.450 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినిమా యూనిట్ ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే కాసేపటి క్రితం ప్రముఖ మూవీ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ కాసేపటి క్రితం చేసిన ఒక ట్వీట్ తో ఈ సినిమా వాయిదా పడింది అనే సంకేతాలు అందుతున్నాయి. 'ఇప్పుడే నాకు ఒక ఎక్స్ క్లూజివ్ న్యూస్ వచ్చింది. సౌత్ ఇండియా సినిమా పరిశ్రమకు చెందిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఒకరు, తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాను వాయిదా వేశారని, అలానే ఆ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే తన పోస్ట్ తో యావత్ దేశవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరినీ అయోమయంలో పడేసిన తరణ్, ఈ విషయమై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.....!