టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో తుది శ్వాస విడిచారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్పాట్ లో ఉన బోయపాటికి విషయం తెలియగానే హుటాహుటిన పెదకాకాని బయలు దేరి వెళ్లారు.