సుకుమార్ - బన్నీ కొత్త సినిమా విషయంలో ఓ ఆసక్తికర టైటిల్ ఒకటి ప్రచారం లోకొచ్చింది. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమాకి నాలుగు టైటిల్స్ ని అనుకోవడమే కాకుండా రాసి పెట్టుకున్నాడని... ఈ సినిమా టైటిల్ కూడా కాస్త వెరైటీగా ఉండబోతుందని అంటున్నారు. సినిమా మొత్తం శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచంద్రనం స్మగ్లిమ్ మీద సాగుతుంది కాబట్టి.. ఈ సినిమాకి 'శేషాచలం' అనే ఓ టైటిల్ ని సుకుమార్ అనుకున్నట్లుగా టాక్. మరి గతంలోనూ రామ్ చరణ్ సినిమా కోసం 'రంగస్థలం' అనే ఊరి పేరుతొ టైటిల్ పెట్టి.. టైటిల్ తోనే మ్యాజిక్ చేసిన సుకుమార్ ఇప్పుడు బన్నీ సినిమా కోసం 'శేషాచలం' అనే టైటిల్ పెడితే బావుంటుంది అని అనుకుంటున్నాడట.