ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు తో కంటనీరు పెట్టించిన కార్తికేయ!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2020, 01:19 PM



మెగా స్టార్ చిరంజీవి అంటే ఎవరికైనా అభిమానమే..చిన్న వారి దగ్గరి నుండి సినీ స్టార్స్ వరకు చిరు అంటే విపరీతమైన అభిమానం చూపిస్తుంటారు. తాజాగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కూడా అలాంటి అభిమానమే చూపించారు. అయితే ఇటీవల జీ తెలుగు మూవీ అవార్డ్స్ 2020 వేడుక హైదరాబాద్‌‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ తన గ్రేసింగ్ డాన్సులతో, భావోద్వేగ మాటలతో చిరు ఉద్వేగానికి గురయ్యేలా చేశారు. హీరో కార్తికేయ చిరంజీవి అలనాటి హిట్ సాంగ్ ‘పదహారేళ్ళ వయసు పడి పడి లేచే మనసు…’ సాంగ్‌కి స్టేజ్ పరఫార్మెన్సు ఇచ్చారు. కార్తికేయ ఎనర్జిటిక్ స్టెప్స్ చూసి ముచ్చట పడ్డ చిరంజీవి, అనంతరం కార్తికేయ ఆయనని ఉద్దేశించి చెప్పిన మాటలకి కంటనీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com