ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ మూవీలో జాయిన్ అయిన అనసూయ !

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2020, 03:33 PM



అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ  సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షెడ్యూల్ నందు పాల్గొంటారు. సుకుమార్ ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. కేరళ షెడ్యూల్ నందు అల్లు అర్జున్ పాల్గొనలేదు. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా, తమిళ వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు. ఐతే ఈ మూవీ కాస్టింగ్ లో పాపులర్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ కూడా జాయిన్ అయ్యారట. రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ ప్రేమగా రంగమత్త అని పిలుచుకునే ప్రాముఖ్యం ఉన్న పాత్ర ఇచ్చిన సుకుమార్,బన్నీ మూవీలో కూడా అలాంటి ఓ రోల్ ఆమెకు సిధ్దం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శేషాచలం అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com