ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సరిలేరు నీకెవ్వరు’ యూఎస్ కలెక్షన్స్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2020, 03:52 PM



దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  11న  విడుదలైంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయినా ఈ మూవీ డే వన్ నుండి కూడా వసూళ్ల వర్షం కురిపిస్తూ సందడి చేస్తుంది. ఇక ఓవర్సీస్ బాక్సాపీస్ వద్ద $2 మిలియన్ మార్క్ వసూళ్లు సాధించింది. విడుదలైన వారం తరువాత సరిలేరు నీకెవ్వరు $ 2 మిలియన్ వసూళ్లను చేరుకొంది. మహేష్ బాబు కెరీర్ లో $ 2 మిలియన్ వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా ఈ మూవీ రికార్డు నెలకొల్పింది. గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు ఈ ఫీట్ ని సాధించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో సరిలేరు నీకెవ్వరు నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com