ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య మూవీ ఐతే ఓకే అంటున్న నయనతార!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2020, 06:20 PM



నయనతార వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తమిళంలో వరుస ఆఫర్లతో ఈ భామ ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌లో సీనియర్ హీరోలకు ధీటుగా దూసుకు పోతోన్న నయన పేరు చెపితే స్టార్ హీరోలు సైతం భయపడుతున్నారు. ఓ సినిమాలో నటించాలంటే ఆమె పెడుతోన్న కండీషన్లు అన్ని ఇన్నీ కావట. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఎవ్వరూ కూడా ఆమెను కాదనే పరిస్థితి లేదు. అయితే ఇటీవల ఆమె సినిమాల్లో నటిస్తున్నా ప్రమోషన్లకు మాత్రం డుమ్మా కొట్టేస్తోంది. ఆ కండీషన్‌కు ఓ కే అయితేనే ఆమె సినిమాలు చేస్తుంది.. లేకుంటే నో చెప్పేస్తోంది. యువ హీరోయిన్లు అంత మంది ఉన్నా సరే ఈ సీనియర్ డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. నయన్ బాలయ్యతో చేసేందుకు మాత్రం ఎప్పుడూ ఓకే అంటోందట. ఇటీవల ఆమెకు సన్నిహితుడు అయిన ఓ దర్శకుడు తెలుగు సినిమాల గురించి ప్రస్తావిస్తే బాలకృష్ణ మినహా ఎవరితోనూ తనకు నటించే ఉద్దేశం లేదని, ఆయన మనుషులకు విలువ ఇస్తారని, ఇతర హీరోల దగ్గర దాదాపుగా అది ఉండదని చెప్పిందట. బాలయ్యతో ఆమె సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాల్లో చేసిన సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com