మహేష్ బాబు ప్రభాస్ రికార్డుని సమం చేశాడు!

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:01 PM

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తోన్న  ‘సరిలేరు నీకెవ్వరు’  11న  విడుదలైంది. ఈ సినిమా మొదటి ఆట నుంచే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.  సంక్రాంతి మూవీ సరిలేరు నీకెవ్వరు యూఎస్ లో కూడా వసూళ్లు దుమ్ము దులిపింది. ఈ చిత్రం అక్కడ $2 మిలియన్ క్లబ్ లో చేరింది. దీనితో యూఎస్ బాక్సాపీస్ వద్ద $2 మిలియన్ వసూళ్లు మూడు సార్లు సాధించిన హీరోగా రికార్డ్ లకి ఎక్కాడు. గతంలో ఆయన నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు $2 మిలియన్ వసూళ్లను సాధించాయి. ఐతే టాలీవుడ్ నుండి ప్రభాస్ మాత్రమే ఈ ఫీట్ సాధించిన హీరోగా ఉన్నాడు. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన బాహుబలి, బాహుబలి 2 మరియు సుజీత్ తెరకెక్కించిన సాహో చిత్రాలు $2 మిలియన్ వసూళ్లు అధిగమించిన చిత్రాలుగా నిలిచాయి. బాహుబలి 2 ఏకంగా $11 మిలియన్ వసూళ్లతో ఇండియాలోనే ఏ చిత్రం చేరుకోలేనంత ఎత్తులో ఉంది. అలా టాలీవుడ్ నుండి ప్రభాస్ మరియు మహేష్ మాత్రమే యూఎస్ బాక్సాపీస్ వద్ద మూడు సార్లు $2 మిలియన్ వసూళ్లను అధిగమించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు, ఎన్టీఆర్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రంతో మొదటిసారి ఎంటర్ అయ్యాడు.
Recent Post