నాగబాబు అదిరింది షోకి అది గట్టి షాకే!

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:21 PM

అయ్యో పాపం నాగబాబు  చేసిన పనికి తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో 'జబర్ధస్త్'. ఈ షోకు మాములుగా ప్రసారమయ్యే సమయంలో ఎంత మంది చూస్తారో.  యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు.  ఏడేళ్లుగా ఈ షో దూసుకుపోతుంది. అయితే  ఈ షోకు పోటీగా జీ తెలుగులో అదిరింది అనే కామెడీ షోను ప్రారంభించారు. ఈ షోతో జబర్ధస్త్ కామెడీ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి. ఈ షో కోసం నాగబాబు తనతో  పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటలును తీసుకువెళ్లడం జరిగింది. తీరా ఈ ప్రోగ్రామ్ ప్రసారమయ్యే సరికి.. ప్రేక్షకులు ఈ  షో చూసి జబర్ధస్త్‌కు జిరాక్స్ కాపీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు అదిరింది ప్రోగ్రామ్‌కు గట్టి షాకే ఇచ్చాయి. ఇక ఇటీవల వచ్చిన రేటింగ్స్ చూస్తే.. జబర్ధస్త్‌కు 5 నుండి 6 రేటింగ్స్ వచ్చాయి. ఇక  ‘అదిరింది’కి మాత్రం కేవలం 0.5 రేటింగ్ వచ్చింది. ఈ పరిస్థితి చూస్తుంటే గతంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో  నాగబాబు నిర్మించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ‘ఆరెంజ్’ మాదిరిగా ఈ షో కూడా ఆయనను బెదరగొట్టిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మీడియా వేదికగా  కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చిన తరువాత ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చాలా మంది భావించారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కు వస్తున్న భారీ రేటింగ్స్  చూస్తుంటే, ఆ షోలో మంచి స్కిట్స్ ప్రదర్శిస్తున్న పార్టిసిపెంట్స్ కు ఉన్న ఆదరణే ఇంకా షోను మంచి స్థాయిలో ముందుకు నడిపిస్తుందని అంటున్నారు.




Recent Post