ఈ హీరో నిర్మాత గా మారబోతున్నాడా?

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:43 PM

ప్రస్తుతం హీరోలంతా నిర్మాతలు గా మారడం..లేదా తాము చేసే సినిమాల్లో పారితోషకం బదులు లాభాల్లో వాటా తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే మాస్ మహారాజ రవితేజ మాత్రం ఇండస్ట్రీ లో హీరోగా రాణించబట్టి చాల ఏళ్లు అవుతున్న నిర్మాణ రంగంలో మాత్రం ఇంతవరకు అడుగుపెట్టలేదు. కానీ ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి, చిన్న, మీడియం సినిమాలు నిర్మించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇది ఎప్పటికి మెటీరియలైజ్ అవుతుందన్నది తెలియదు. ప్రస్తుతానికి అయితే రవితేజ కు ఈ ఆలోచన మాత్రం వచ్చిందన్నది నిజం అంటున్నారు. ఇక ప్రస్తుతం వి ఐ ఆనంద్ డైరెక్షన్లో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. జనవరి 24 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recent Post