సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ ఫోటోలు వైరల్

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 19, 2020, 07:56 PM

నటి రేణూ దేశాయ్ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశారు. తన సినిమా షూటింగ్ ముగించుకొని ప్రొడక్షన్ డిజైనర్ తో కలిసి కారులో ఓ మారుమూల గ్రామం మీదుగా హైదరాబాద్ కు ప్రయాణిస్తుండగా.. డిజైనర్ తో తనకు అప్పుడే హైదరాబాద్ వెళ్లిపోవాలని లేదని చెప్పిందట రేణూ దేశాయ్. వెంటనే ఆమె కారు దిగేసి ఆమె ఆ గ్రామస్థులను కలిసింది. రేణూ దేశాయి రాగానే గ్రామస్థులు సంబరపడిపోయారు. గ్రామస్థులు రేణూ దేశాయ్ కు ఉప్మా, టీ ఇచ్చారు. చలిగా ఉండడంతో మంట కూడా వేశారు. ఆ రాత్రి ఆమె వారితోనే అలా నిద్రపోయింది. ఈ విషయాలను రేణూ దేశాయ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recent Post