ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇషాకు అదిరిపోయే ఆఫర్ !

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 12:26 PM



ఇకపై  నటి   ఇషా రెబ్బా  కేవలం  తెలుగులోనే  కాదు  ఇరుగు  పొరుగు  పరిశ్రమల్లోనూ  లక్ చెక్  చేసుకోనుంది. తొలిగా  బాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు  సన్నాహకాల్లో  ఉంది. ముంబై  పరిశ్రమ  నుంచి  ఇషాకు  అదిరిపోయే  ఆఫర్  వచ్చిందట. అనీల్ కపూర్  వారసుడు  హర్షవర్ధన్ కపూర్ సరసన  సోషల్  కాన్సెప్ట్  ఉన్న  సినిమాలో  ఆఫర్  అందుకుంది. బాలీవుడ్  ఫిలింమేకర్  రాజ్ సింగ్ చౌదరి  ఈ  చిత్రానికి  దర్శకత్వం  వహిస్తున్నాడు. ఇషా  ఈ  చిత్రంలో  రాజస్థానీ  అమ్మాయిగా  కనిపించనుంది. మహిళా  సాధికారతను.. స్త్రీ  శక్తిని  ఎలివేట్  చేసే  కథాంశంతో  ఈ సినిమా  తెరకెక్కనుంది. ఇందులో  నావెల్టీ  ఉన్న  పాత్రలో  ఇషాకు  నటించేందుకు  ఆస్కారం ఉందని  సమాచారం. ఎస్.ఆర్.కే అనే సినిమాతో ఇషా కన్నడ రంగంలోనూ అడుగుపెడుతోంది. అలాగే తమిళంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది. ఇకపై ఇషా పలు సినిమాలతో  బిజీగా మారనుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com