రేపు "జాను" నుండి ఫస్ట్ సింగల్...

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 06:08 PM

శర్వానంద్ .. సమంత జంటగా ప్రేమ్ కుమార్ రూపొందిస్తున్న 'జాను' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. గోవింద్ వసంత సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, రేపు సాయంత్రం 5 గంటలకు 'ప్రాణం' అనే సింగిల్ సాంగ్ ను వదలనున్నారు.


తమిళంలో హిట్ కొట్టిన '96' మూవీకి ఇది రీమేక్. విజయ్ సేతుపతి పాత్రను శర్వానంద్ పోషిస్తుండగా, త్రిష పాత్రలో సమంత కనిపించనుంది. తమిళ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తుండటం విశేషం. వైవిధ్యభరితమైన ఈ సినిమాపట్ల నిర్మాతగా 'దిల్' రాజు ఎంతో నమ్మకంతో వున్నాడు. ఇక శర్వానంద్ - సమంత ఇద్దరూ కూడా ఈ సినిమా తమ కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.
Recent Post