ప్రస్తుతం దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు తమిళ స్టార్ నటుడు విజయ్. ‘మాస్టర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లో 64వ సినిమా. ఈ సినిమాలోనూ విజయ్ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగు దశలో ఉండగానే ఆయన తన 65వ సినిమాను లైన్ లో పెట్టేశాడు. ‘పాండిరాజ్’ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని సమాచారం. గతంలో ‘కాడైకుట్టి సింగం’.. ‘నమ్మ వీట్టు పిళ్లై’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇటీవల విజయ్ ను కలిసి ఒక కథను వినిపించాడట. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.