65వ చిత్రానికి ‘విజయ్’ గ్రీన్ సిగ్నల్

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 07:20 PM

ప్రస్తుతం దర్శకుడు   లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో   ఒక   సినిమా  చేస్తున్నాడు  తమిళ స్టార్ నటుడు విజయ్. ‘మాస్టర్’ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లో    64వ సినిమా. ఈ  సినిమాలోనూ విజయ్ విలక్షణమైన పాత్రను పోషిస్తున్నాడు. ఈ   చిత్రం   షూటింగు  దశలో ఉండగానే ఆయన  తన 65వ సినిమాను లైన్ లో  పెట్టేశాడు. ‘పాండిరాజ్’ ఈ  సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడని సమాచారం. గతంలో ‘కాడైకుట్టి సింగం’.. ‘నమ్మ వీట్టు పిళ్లై’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన ఇటీవల విజయ్ ను కలిసి ఒక కథను వినిపించాడట. కాన్సెప్ట్ కొత్తగా  ఉండటంతో  వెంటనే  ఆయన  గ్రీన్ సిగ్నల్  ఇచ్చేశాడట.


 


 
Recent Post