‘కస్తూరి’ ట్వీట్ తో మరింత రెచ్చిపోయిన ‘అజిత్’ ఫ్యాన్స్

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 20, 2020, 08:25 PM

తెలుగులో పలు చిత్రాల్లో  నటించింది  కస్తూరి.  ఈమె  ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఈమెను  కొన్ని  రోజుల క్రితం అజిత్  ఫ్యాన్స్ టార్గెట్  చేశారు. తమ  అభిమాన  హీరోను  అవమానించేలా  మాట్లాడావని   కొన్ని రోజులుగా కస్తూరిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వారి బ్యాడ్ కామెంట్స్ పై ఎప్పటికప్పుడు  కస్తూరి స్పందిస్తూనే ఉంది. తాజాగా  నాపై  బ్యాడ్  కామెంట్స్ పెట్టే వారు  మొదట వారి తల్లిని ..చెల్లిని గుర్తు  తెచ్చుకుంటే  బాగుంటుంది అంటూ సలహా ఇచ్చింది. ఈ పోస్ట్ కు కూడా నెటిజన్స్ తీవ్రంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమెను మరోసారి టార్గెట్ చేసి నీవు చేసేలా మా అమ్మ.. చెల్లి ప్రవర్తించడం లేదు.. నీకు వారితో పోలిక ఏంటీ అంటూ మరింతగా రెచ్చి పోతున్నారు. అలాంటి కామెంట్స్ చేసే వారిని పట్టించుకోకుండా ఉండటం మంచిదని కొందరు కస్తూరికి  సలహా ఇస్తున్నారు.
Recent Post