ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘జాను’ నుండి మెలోడి సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 21, 2020, 06:49 PM



తమిళ  సూపర్ హిట్ ’96’ చిత్రాన్ని తెలుగులో   ‘జాను’గా తెరకెక్కించారు .  తమిళ  ఒరిజినల్ కు  దర్శకత్వం  వహించిన  ప్రేమ్ కుమార్  తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.  తాజాగా  ఈ  సినిమానుండి ‘ప్రాణం’ అంటూ సాగే  లిరికల్ సాంగ్  విడుదలయింది.  ఈ  సినిమాకు  సంగీత దర్శకుడు  గోవింద వసంత.  ‘ప్రాణం’ పాటకు సాహిత్యం అందించిన వారు శ్రీమణి.  చిన్మయి శ్రీపాద.. గౌతమ్ భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు.  “ప్రాణం నా ప్రాణం నీతో ఇలా గానం తొలి గానం పాడే వేళ తారాతీరం మన దారిలో కాంతులే కురిసేలా చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా” అంటూ ఈ పాట సాహిత్యం సింపుల్ పదాలతో మాయ చేసేలా సాగింది.  ఈ పాటకు గోవింద వసంత  సున్నితంగా మనసు తీగలను అలా మీటినట్టు ఉండే ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను అంతకంటే అందమైన ఫీల్ తో.. ఎంతో సున్నితంగా చిన్మయి.. గౌతమ్ పాడారు.  ఈమధ్యకాలంలో తెలుగు సినిమాలలో వచ్చిన బెస్ట్ మెలోడీస్ లో ఇదొకటి అని చెప్పొచ్చు.  పాట ట్యూన్ లో కొంత బాధ ధ్వనిస్తున్నప్పటికీ అదే ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తోంది. ఈ చిత్రంలో నటులు సమంత..శర్వానంద్ జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com