నన్ను చిన్నప్పుడే రేప్ చేసారు : రాహుల్ రామకృష్ణ

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 06:55 PM

"అర్జున్ రెడ్డి"  చిత్రంలో  నటుడు   రాహుల్  రామకృష్ణ  త‌న‌దైన  కామెడీతో   ప్రేక్ష‌కుల‌ను  న‌వ్వించాడు. క‌మెడియ‌న్‌గా, న‌టుడిగా ఈయ‌న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా  త‌న  వ్య‌క్తిగ‌త విష‌యాన్ని ట్విట్ట‌ర్  ద్వారా  చెప్పి  సోష‌ల్ మీడియాలో  సంచ‌ల‌న  క్రియేట్ చేశాడు. త‌న‌ను చిన్న‌ప్పుడు  రేప్ చేశార‌ని, ఆ బాధ‌ను  ఎవ‌రితో పంచుకోవాలో తెలియ‌లేద‌ని అందుకే ట్విట్ట‌ర్ ద్వారా పంచుకుందామ‌ని పోస్ట్ చేస్తున్న‌ట్లు ఈ న‌టుడు  తెలియ‌జేయడం విశేషం. ఇలా  ఇత‌రుల‌తో  విష‌యాల‌ను  పంచుకోవ‌డం  ద్వారా  నేనేంటో  తెలుసుకోగ‌లుగుతున్నాన‌ని  చెప్పాడు. ఈ విష‌యం తెలుసుకున్న నెటిజన్స్ షాక‌వుతున్నారు.
Recent Post