‘పర్వీన్ బాబీ’గా ‘అమలాపాల్’

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 07:18 PM

బాలీవుడ్ నటి  పర్వీన్‌ బాబీ పాత్రలో  మెరవనుందట నటి   అమలా పాల్‌. ఆ పాత్రకి అమలాపాల్ అయితేనే   కరెక్ట్‌గా సరిపోతుందని  ఆ చిత్ర  టీమ్‌ భావించారట. ఈ వెబ్‌ సిరీస్‌ను బాలీవుడ్  ప్రముఖ దర్శకుడు  మహేశ్‌ భట్, ముఖేష్‌ భట్‌ కలిసి విశేష్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై  నిర్మిస్తారు. త్వరలోనే ఈ షూటింగ్‌లో జాయిన్‌ కాబోతుందట అమలా పాల్‌.  ‘‘1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్‌ ప్రయాణం మొదలుపెడుతున్నాను’’ అని ఆ మధ్య ప్రకటించారు హిందీ దర్శక–నిర్మాత మహేశ్‌ భట్‌. అయితే ఇది నటి పర్వీన్‌ బాబీకి, మహేశ్‌ భట్‌కి మధ్య జరిగిన వాస్తవ కథే అని బాలీవుడ్‌ టాక్‌. పర్వీన్‌ బాబి బయోపిక్‌ తరహాలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని సమాచారం.
Recent Post