ముగిసిన ‘భాగీ3’ షూట్

  Written by : Suryaa Desk Updated: Tue, Jan 21, 2020, 08:25 PM

‘భాగీ3’  ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ మూవీలో   టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా  నటించాడు. హీరోయిన్‌గా  శ్రద్ధాకపూర్‌ నటించింది. అహ్మద్‌ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ కీలక పాత్ర పోషించాడు. ఇందులో రితేష్, టైగర్‌ ష్రాఫ్‌  బ్రదర్స్‌గా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ఇది.
Recent Post